|
పరిచయం
సంరక్షణా బాధ్యత కల తండ్రిగా మీరు మీ పిల్లవాడు అత్యుత్తమైన దాన్నే పొందాలని కోరుకుంటారు. మీ ప్రియమైన వారిపట్ల మీ స్వప్నాలను ఫలింప జేసుకునేందుకు, వారి సురక్షిత భవిష్యత్తుకోసం ఆర్థిక ప్రణాళికను రచించుకోవడం చాలా ముఖ్యమైన పని.
జీవన ప్రమాణం పెరుగుతుండటంతో, మీ పిల్లల విద్యా ఖర్చులు కూడా పెరుగుతున్నాయి. మీ పిల్లల విద్యా ఖర్చును ముందస్తుగా ఆదా చేయాలని లేదా పథకాన్ని ప్రారంభించాలని మీరు కోరుకుంటున్నట్లయితే, బీమాను ఒక ఇన్వెస్ట్‌మెంట్ ఎవెన్యూగా చూడటం ఎప్పటికీ మీకు తోడ్పడుతుంది. మీ బిడ్డకు డబ్బు అవసరం పడిన సమయానికి ఇది గ్యారంటీ ఇవ్వగల ప్రాడక్ట్‌గా ఉంటుంది.
బీమా మరియు మీ పిల్లల ఉన్నత విద్య
ప్రతి తండ్రి లాగే, మీ పిల్లలకు ఉత్తమ విద్య గురించిన కలల్ని మీరు కూడా తప్పక కలిగి ఉంటారు. జీవిత బీమా అనేది ఏదైనా అనూహ్య ఘటనలు జరిగిన సందర్భంలో మీ పిల్లల చదువుకు సంబంధించి మీకు ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. తగిన ఆర్థిక ప్రణాలికతో, మీ పిల్లల పెద్ద పెద్ద కలల్ని కూడా నెరవేర్చేలా మీ మదుపులను మీరు పెంచుకోవచ్చు.
బీమా చేయించుకున్న తండ్రి లక్ష్యం అతడి కుటుంబం యొక్క రోజువారీ అవసరాలను అందించడం, దాంతోపాటు విద్య మరియు పెళ్లి వంటి తన పిల్లల భవిష్యత్ ఖర్చులను అందించేలా ఉండాలి. మీకూ లేదా 18-26 వయసు గ్రూపులో ఉన్నప్పుడు మీ పిల్లలకు డబ్బు అందించడానికి అనేక బీమా పాలసీలు ఉన్నాయి.
మీకు ఎంత జీవిత బీమా అవసరం అవుతుంది?
మీ పిల్లలకు అందించడానికి రెండు మార్గాలున్నాయి
- మీ పిల్లల భవిష్యత్ ఖర్చులను దాంతో పాటు మీ కుటుంబ భవిష్యత్ ఖర్చులను అందించే పెద్ద మొత్తాన్ని మీరు బీమా చేయవచ్చు.
- అదనంగా, మీ పిల్లల భవిష్యత్ ఖర్చులను బీమా పాలసీ ద్వారా అందించవచ్చు (మీరు చేస్తున్న ఇతర మదుపులకు అదనంగా) మీ సమక్షంలో లేదా పరోక్షంలో మీరు కోరుకుంటున్న వయస్సులో అతడు/ఆమె డబ్బు అందుకునేలా మీరు బీమా చేయవచ్చు.
మీ జీవిత బీమా కవరేజ్ స్థాయిని గణిస్తున్నప్పుడు గుర్తుంచుకోవలసిన కొన్ని ఖర్చులు:
- మీ ఆర్థిక లక్ష్యాలు ఏవి? మీ ప్రస్తుత అవసరాలు, మీ పొదువులు, మీ ఆర్థిక ఆకాంక్షలు వంటి సందర్భాల్లో - కారు కొనుక్కోవడం లేదా మీరు అద్దె ఇంట్లో ఉంటున్నట్లయితే సొంత ఇల్లు తీసుకోవడం వంటివి.
- మీ లక్ష్యాలను చేరుకోడానికి, మీరు ఇతర ఓ ఆర్థిక పథక వ్యూహాలను మనసులో పెట్టుకున్నారు? ఉదాహరణకు, మీరు 2 సంవత్సరాల తర్వాత ఇల్లు కొనడానికి ప్లాన్ చేసుకున్నట్లయితే, మీరు డౌన్ పేమెంట్‌గా చెల్లించడానికి మీకు ఎంత డబ్బు అవసరం అవుతుంది (అది రుణం ద్వారా ఫైనాన్స్ చేయబడినట్లయితే)? మీ మదుపులు ఆ సమయానికి పూర్తిగా హరించుకుని పోయి ఉంటాయా?
- బతికి ఉన్న మీ వారికి ఆర్థికంగా సాయపడేందుకోసం తగినంత బీమాను మీరు కోరుకుంటున్నారా లేదా ఉన్నత విద్యకు వెచ్చించడానికి మరియు/లేదా భాగస్వామి పదవీ విరమణ అవసరాలను తీర్చేందుకు మీకు తగిన వనరులున్నాయా?
మీ పిల్లల పాలసీ మీకు ఎలా కవర్ చేయాలి?
మీరు మీ పిల్లల పాలసీని చెల్లించే పేరెంట్/సంరక్షకుడు అయినట్లయితే మీ పాలసీ మీకు ఇవి ప్రతిపాదించేటట్లు చూసుకోండి
- ప్రీమియం రద్దు - మీరు మరణించిన సందర్భంలో లేదా మిమ్మల్ని ప్రమాదం శాశ్వతంగా అంగవికలుడిని చేసిన సందర్భంలో, ఈ నిబంధన బీమా చేయించుకున్న పేరెంట్‌కి అందుబాటులో ఉంటుంది, దీని ప్రకారం మీరు తదుపరి ప్రీమియంలు కట్టనవసరం లేదు.
- ఒక వయసులో గ్యారంటీ ఇవ్వబడిన డబ్బు - పిల్లల పాలసీ లక్ష్యం ఏమంటే, నిర్దిష్ట వయసులో పిల్లలు ఒక ఏకమొత్తం డబ్బును అందుకునేలా చేయడమే. అందుచేత, పేరెంట్ చిన్న వయసులోనే చనిపోయినట్లయితే, పాలసీ కొనసాగుతుంది, దాంట్లో తదుపరి ప్రీమియంలు చెల్లించనవసరం లేదు పిల్లలు ఒక వయసు వరకు కొంత నిర్దిష్టమైన మొత్తంలో డబ్బును అందుకుంటుంటారు.
- బీమా చేయించుకున్న తండ్రి లేదా సంరక్షకుడి చావు కారణంగా పాలసీ నిలిచిపోకూడదు - కొన్ని పాలసీలు హామీ ఇచ్చిన మొత్తాన్ని మరియు టర్మ్‌కు వచ్చే బోనస్‌ని అందిస్తాయి మరియు అప్పటినుండి పాలసీ నిలిచిపోతుంది.. ఒక నిర్దిష్ట వయస్సులో మీ పిల్లాడికి డబ్బు అందించడమే మీరు కొనుగోలు చేస్తున్న పాలసీ లక్ష్యమయితే మీరు చిన్న వయసులోనే చనిపోయినప్పటికీ మీ పాలసీ నిలిచిపోకూడని విధంగా జాగ్రత్త పడండి.
|