|
పరిచయం
ఇల్లు కొనడం మీ జీవితంలో ఒక ముఖ్యమైన దశ. బహుశా మీరు చేయబోయే అతి పెద్ద మదుపులలో ఒకటి. బ్యాంకు నుంచి రుణం తీసుకోవడం లేదా మీ యజమాని నుంచి వడ్డీ లేని రుణం తీసుకోవడం ఏ అర్థంలో తీసుకున్నప్పటికీ "మీ స్వంత ఇంటిని కలిగి ఉండటం" అనేది ఎన్నటికీ విలువైనదే! పైగా, మీ స్వతం ఇంటిని కలిగి ఉండటం అనేది కొత్తగా జీవితాన్ని ప్రారంభించడం లాంటిది మరి! మీరు ఒకసారి స్థిరపడ్డాక మీ జీవిత బీమా అవసరాల గురించి ఆలోచించండి. చిన్న పథకం మీ కుటుంబం’యొక్క భవిష్యత్తును కాపాడటంలో మీకు సాయపడుతుంది.
చాలామంది కొత్త ఇంటి కొనుగోలుదారులకు మల్లే, మీరు బహుశా గృహ రుణంతో మీ ఇంటిని కొనుగోలు చేసి ఉంటారు. అదే సమయంలో, ఏదైనా దురదృష్టకర సంఘటన సంభవించినప్పుడు మీ ఇంటిపై కొనసాగుతున్న రుణాన్ని చెల్లించడానికి మీ కుటుంబానికి సాయపడేందుకు సరిపోయేంత జీవిత బీమాను తీసుకోవాలని కూడా మీరు భావిస్తుంటారు. తగినంత జీవిత బీమాను కలిగి ఉండటం ద్వారా, వారి కోసం మీరు తీసుకున్న స్వంత ఇంటిని వారు పొందగలరని మీరు ఆశించవచ్చు
జీవిత బీమా మరియు స్వంత ఇంటిని కొనుగోలు చేయడం
ఇంటికి ఫైనాన్స్ చేయడానికి రుణం తీసుకోవడం
నేను కష్టపడి ఆర్జించిన పొదుపులు నా స్వతం ఇంటికి ఫైనాన్స్ చేశాయి
ఇంటికి ఫైనాన్స్ చేయడానికి రుణం తీసుకున్నారు :-
తమ స్వంత ఇంటిని కొన్నప్పుడు చాలామంది ప్రజలు ఇంటి కొనుగోలు కయ్యే మొత్తం విలువను చెల్లించలేరు లేదా ఇష్టపడరు (ఫైనాన్స్ మరియు పన్ను రాయితీలు అందుబాటులో ఉన్న కారణంగా). కొత్త ఇంటిని కొనుగోలు చేయడానికి చాలామంది గృహ రుణం తీసుకోవడానికి ఇదే ముఖ్య కారణం.
గృహ రుణం తీసుకుంటున్నప్పుడు జీవిత బీమా ఎందుకు అవసరం?
|
| ఎ. |
గృహ రుణం తీసుకోవడం సౌకర్యవంతమయినదే కానీ రుణ పత్రాలను ఒకసారి జాగ్రత్తగా చదవండి - అంటే మీరు ప్రిన్సిపల్ పేమెంట్లను చెల్లించినంతవరకు మాత్రమే మీరు స్వంత ఇంటిని కలిగి ఉంటారు, మిగతా ఇంటిభాగం హౌసింగ్ లేదా పైనాన్స్ కంపెనీ చేతిలో ఉంటుంది.
|
| బి. |
ప్రిన్సిపల్ పేమెంట్లను మొత్తంగా చెల్లించడానికి 10-15 సంవత్సరాలు లేదా 20 సంవత్సరాలు కూడా కావచ్చు.
|
| సి. |
జీవిత బీమా తీసుకుంటే మీరు ప్రశాంతంగా ఉండవచ్చు, కాబట్టి మీ కుటుంబం మీకు అనుకోని సంఘటనలు ఎదురైనప్పుడు ఆర్థిక మద్దతును పొందగలుగుతుంది. ఇక్కడే జీవిత బీమా పాలసీ వ్యవహార ప్రక్రియ మీకు తోడ్పడుతుంది. జీవిత బీమా మిగిలి ఉన్న రుణం మొత్తాన్ని చెల్లించడానికి ఉపయోగపడుతుంది మరియు ఇంటిని మీ కుటుంబానికే అందిస్తుంది కూడా.
|
|
మీకు ఎంత జీవిత బీమా అవసరం అవుతుంది?
జీవిత బీమా ఈ సందర్భంలో మీ రుణం మొత్తంపై ఆధారపడి ఉంటుంది. ఏమైనప్పటికీ, కొన్ని బీమా కంపెనీలు మాత్రమే మీ రుణం మొత్తాన్ని కవర్ చేయగలిగిన బీమా పాలసీలను ప్రతిపాదిస్తున్నాయి; ఉదాహరణకు, మీ రుణం మొత్తం వార్షిక ప్రాతిపదికన తగ్గిపోతూ ఉన్నట్లయితే - అప్పుడు రుణం మొత్తానికి లోబడి మీ రక్షణ ఎమౌంట్ తగ్గిపోయేలా బీమా పాలసీలు కూడా ఉన్నాయి.
మీ రుణం మొత్తానికి పూచీ పడే బీమా పాలసీని మీరు ఎలా కొనగలుగుతారు?
చాలా ఫైనాన్స్ కంపెనీలు లేదా గృహ రుణ కంపెనీలు తమ రుణాలకు భద్రతను అందించే రుణగ్రహీతలను ఆశిస్తాయి. అందించబడే భద్రత సాధారణంగా ఆస్తే అయి ఉంటుంది - ఇల్లు కూడా. ఏదేమైనప్పటికీ, రుణ మొత్తానికి సమానంగా ఉండే జీవిత బీమా పాలసీ, గృహ/ఫైనాన్స్ కంపెనీకి పాలసీ ప్రయోజనాలను అసైన్ చేసేటటువంటివి రుణానికి ప్రతిగా భద్రతను అందించగలవు.
పైగా, కొద్ది గృహ కంపెనీలు రుణ గ్రహీత చెల్లించిన ఇన్‌స్టాల్‌మెంట్‌కి అదనపు మొత్తాన్ని జోడిస్తాయి. రుణం గడువు కాలంలో బీమా చేయించుకున్న వ్యక్తి మరణించిన సందర్భంలో, బీమా వ్యవహార ప్రక్రియ గృహ లేదా పైనాన్స్ కంపెనీకి మిగులు మొత్తాన్ని చెల్లిస్తుంది.
నా కష్టార్జితంతో చేసుకున్న పొదుపులు నా ఇంటికి ఫైనాన్స్‌ను అదించాయి :-
మీరు కూడబెట్టిన పొదుపులలో చాలా మొత్తం మీ కొత్త ఇంటి రుణంకి గాను ఖర్చయిపోయి ఉంటుంది. కొత్త ఇంటి కొనుగోలు అనేది కొత్త ప్రారంభాన్ని చేయడం లాంటిది, దీర్ఘకాలం పాటు మీ సేవింగ్స్ లాక్ అయి ఉంటాయి కాబట్టి మీ బీమా అవసరాలను ఇప్పుడు తిరిగి మదింపు చేసుకోవలసి ఉంటుంది.
జీవిత బీమా ముఖ్యోద్దేశం ఏమంటే, మీకూ, మీ కుటుంబానికి భవిష్యత్తును భద్రపర్చడమే.
జీవిత బీమా ముఖ్యమైన విధి ఏమంటే అడ్డంకులు లేని భవిష్యత్తు కోసం మీ కుటుంబానికి ఆర్థిక మద్దతును అందించటమే. మీ వివాహ పరిస్థితి, పిల్లల సంఖ్య, మీ రుణాలు, ఖర్చులు, మీ ఆదాయ అవసరం, మీ జీవన శైలి మరియు మీ భవిష్యత్ లక్ష్యాలు వంటివాటి ఆధారంగా, మిమ్మల్ని, మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి మీరు చర్యలు చేపట్టవలసి ఉంటుంది
|