 |
|
పరిచయం
పదవీవిరమణ అనేది మీ జీవిత బీమా అవసరాలను తిరిగి ఆలోచించేందుకు మంచి సమయం, అవి మీ జీవితంలోని కొత్త దశను ఖచ్చితంగా ప్రతిబింబిస్తాయి. మీ బీమా మీ వేతన ఆదాయాన్ని ఎంతకాలమో భర్తీ చేయలేకపోవచ్చు లేదా మీకు రుణాలు లేదా చెల్లింపులు వంటివి ఉండవచ్చు మరియు మీ పిల్లల ఉన్నత విద్య మరియు పెళ్లి ఖర్చులను అందించడం గురించి మీరు ఆందోళన చెందుతుండవచ్చు (ఆ అవకాశం ఉండవచ్చు) వాస్తవానికి, మీరు ఇప్పుడు ఆర్థికంగా ఆధారపడటంపై దృష్టి పెడుతుండవచ్చు - కనీసం మీ మరియు మీ భార్య ఖర్చులకోసం మీ పిల్లలపై ఆధారపడకూడదని అనుకుంటుండవచ్చు.
బీమా మరియు పదవీవిరమణలు
మీరు రిటైర్ అయినప్పుడు, అది మీ బీమా కవరేజ్‌ని తిరిగి అంచనావేయగల సమయం. ఎందుకంటే మీ ఆర్థిక బాధ్యతలు మరియు ప్రాధాన్యతలు మారుతున్నాయి, మీ బీమా అవసరాలు కూడా మారుతున్నాయి. మీరు వేతనం ద్వారా ఆర్జించడం ఆపివేస్తున్నారు కనుక మీ నెల వారీ ఆదాయం తగ్గిపోతుంటుంది. కమ్యూటింగ్, బట్టలు మరియు ఆహారం వంటి వాటిపై మీరు పెట్టే ఖర్చులు తగ్గుముఖం పడతాయి కనుక మీ గృహావసరాల ఖర్చు కూడా క్షీణిస్తూంటుంది. మీరు అల్ప ఆదాయ పన్ను పరిధిలోకి వచ్చి ఉండవచ్చు. మీ ఆర్థిక స్థితిలో చాలా మార్పులు రావడంతో మీ రిటైర్మెంట్ పరిస్థితులు మీ జీవితంకి మల్లే సురక్షితంగా ఉండేలా చూసుకోవలసి ఉంటుంది.
పెన్షన్ ఉత్పత్తులు
|
| • |
బీమా కంపెనీలు పెన్షన్ ఉత్పత్తులను ప్రతిపాదిస్తుంటాయి, అవి వ్యక్తులను తక్షణం పెన్షన్‌ని అందుకోవడానికి లేదా ఒక నిర్దిష్ట వయస్సులో పెన్షన్ అందుకోవడానికి అనుమతిస్తాయి.
|
| • |
పాలసీ గడువు కాలంలో, వ్యక్తులు అభద్రతతోనే ఉంటారు.
|
| • |
అతడి మరణం సంభవించినప్పుడు, అతడి భార్య లేదా నామినీ గ్యారంటీ ఇవ్వబడిన సమయానికి నెలవారీ పెన్షన్ అందుకోవడం (దీన్ని బీమా చేసిన వ్యక్తి ఎంచుకుని ఉంటాడు) లేదా పాలసీ ముగిసినప్పుడు ఏకమొత్తం నగదును అందుకోవడం అనే ఐచ్ఛికాన్ని కలిగి ఉంటారు.
|
| • |
సాధారణంగా ఇలాంటి పాలసీలు ప్రీమియం రూపంలో రెగ్యులర్ ప్రాతిపదికన డబ్బు చెల్లించడానికి వ్యక్తులకు అనుమతిస్తుంటాయి.
|
| • |
పైగా, కొన్ని పెన్షన్ పాలసీలు సెక్షన్ 10సిసిసి కింద పన్ను రాయితీలను అందిస్తాయి, ఇవి ఇతర బీమా ఉత్పత్తులలో లభ్యం కాకపోవచ్చు.
|
| • |
ఏదైనప్పటికీ, అలాంటి పాలసీకి చెల్లించిన ప్రీమియం పన్ను రాయితీలను అందిచవచ్చు, పెన్షన్‌గా అందుకున్న నగదుపై పన్నుపోటు పడవచ్చు.
|
|
రిటైర్మెంట్ వచ్చింది! దాదాపుగానా?
మీరు ఇప్పుడే పదవీవిరమణ చేసి ఉంటే లేదా తదుపరి టర్మ్‌లో రిటైర్ కాబోతున్నట్లయితే, ఇప్పటికీ మీ ఆర్థిక అవసరాలకు ప్లాన్ చేసుకుంటూ ఉంటే, మీరు గుర్తుంచుకోవలసిన కొన్ని అంశాలు ఇక్కడ ఉన్నాయి చూడండి.
అనేక మార్గాల గుండా మీ సేవింగ్స్‌ని తీసుకోవచ్చు
మీరు అందుకునే వాటికోసం ఒక ఖాతా రూపొందించుకోండి
ఒక నిర్దిష్ట సమయంలో అందుకునే నగదుకు సంబంధించిన ఏకమొత్తం
|
| • |
ఉద్యోగ భవిష్య నిధి |
| • |
సంవత్సరాలుగా పోగుబడుతూ వచ్చిన పీపీఎఫ్ నగదు |
| • |
ఎన్ఎస్‌సి, ఇన్‌ఫ్రా-బాండ్లు, ఎఫ్‌డీఐలు వంటి మెచూర్ కావడానికి సిద్ధంగా ఉన్నవి. |
| • |
త్వరలో మెచూర్ అయ్యే పాలసీలతో బీమా చేయించుకోండి
|
| రెగ్యులర్ ప్రాతిపదికన మీరు ఆశిస్తున్న డబ్బు కింద పేర్కొన్నటువంటివి |
| • |
మీ పదవీవిరమణ పాలసీల నుండి వచ్చిన పెన్షన్ |
| • |
మీ మాజీ యజమాని నుంచి వచ్చిన పెన్షన్ |
| • |
మీ రెగ్యులర్ ఆదాయ ఫండ్లనుంచి వచ్చిన ఆదాయం
|
మీ ఖర్చులను అంచనావేయండి
మీరు పెట్టిన ఖర్చులకు సంబంధించి ఒక ఖాతా రూపొందించండి (మీకు రుణాలు లేదా చెల్లింపులు ఉండవనే ఆశిద్దాము) |
| • |
నెలవారీ గృహావసర ఖర్చులు - అనుకోకుండా వచ్చిన వైద్యబిల్లుల కోసం 10% బపర్ కలిసే ఉంటుంది.
|
| • |
నెలకోసం కంటింజెన్సీ ఫండ్ (మీ మనవరాలి పుట్టినరోజు పార్టీ కోసం అనుకోకుండా గడిపిన సెలవుదినం లేదా మీ పొరుగువారితో కలిసి అనుకోకుండా తీర్థయాత్రకు వెళ్లవలసి రావడం)
సాదారణంగా తీసుకునే వైద్య పరీక్షలు, బీమా పాలసీలు, వినోదం / వెకేషన్ పొదుపులు వంటి ఖర్చులు కూడా మీకు తగులుతాయని అంచనా వేసుకోండి (అదే ప్రాధాన్యతా క్రమంతో)
|
|
కంటింజెన్సీ ఫండ్ - మీకూ మీ భార్యకూ ఒక కంటింజెన్సీ ఫండ్ రూపొందించుకోండి, ఉన్నట్లుండి వైద్య ఖర్చులు తగిలే పక్షంలో ఉపయోగపడతాయి.
ఆరోగ్య బీమా - మీ మరియు మీ భార్య ఇప్పటికీ ఆరోగ్య బీమా పాలసీ రక్షణలో ఉంటున్నట్లు నిర్ధారించండి. అలాగే, మీరు కవర్ చేసిన మొత్తం రూ 25,000 లేదా రూ 50,000 వంటి చిన్న మొత్తంగా ఉండదని నిర్ధారించుకోండి.
పెన్షన్ ప్రాడక్టులు - మీరు పెన్షన్ అందుకున్నప్పటికీ, మీ పరోక్షంలో మీ భార్య మీ నెలవారీ ఖర్చులతో వ్యవహరించగలిగేలా చూసుకోండి. మీరు దానికోసమే బీమా చేయించకపోయినట్లయితే, తక్షణం పెన్షన్‌ని అందించగలిగే బీమా ఉత్పత్తులతో మీరు ఇప్పటికీ బీమా చేయించుకోవచ్చు.
పైన చెప్పిన అన్నింటిలో మీరు పాలు పంచుకుని ఉండినట్లయితే మీరు చేయవలసిందేమంటే ఇక సాగిలపడి కూర్చుని రిలాక్స్ కావడమే!!! చక్కటి సమయాన్ని ఆస్వాదించండి!!!
|